వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా పలు ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాణి గోవర్ధనన్ ఎక్కడున్నారో తెలియడం లేదని.. కాకాణి ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటన చేశారు. వైసీపీ వాళ్లు అయినా సరే ఆయన ఆచూకీ చెపితే వారికి కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్‌ను బహుమతిగా ఇద్దామని అనుకుంటున్నానన్నారు. కాకాణి సవాళ్లు విసిరాడని, తొడలు కొట్టాడని, ఇప్పుడు ఎక్కడున్నాడని సోమిరెడ్డి ప్రశ్నించారు. కాకాణి కనిపిస్తే చూడాలని ఉందని.. మంత్రులుగా పని చేసిన వాళ్లు పిరికివాళ్ల మాదిరి ఇలా పారిపోతారని అనుకోలేదని సోమిరెడ్డి విమర్శించారు.