ఆందోళన వద్దు.. త్వరలోనే మిగిలిన సొమ్ము జమ అవుతుంది.. సాంఘిక సంక్షేమ శాఖ కీలక ప్రకటన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ కుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ తల్లికి వందనం న‌గ‌దు జ‌మ‌ విష‌యమై ఒక ప్ర‌క‌ట‌న ద్వారా క్లారిటీ ఇచ్చారు.

By Medi Samrat
Published on : 24 July 2025 3:04 PM IST

ఆందోళన వద్దు.. త్వరలోనే మిగిలిన సొమ్ము జమ అవుతుంది.. సాంఘిక సంక్షేమ శాఖ కీలక ప్రకటన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ కుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ తల్లికి వందనం న‌గ‌దు జ‌మ‌ విష‌యమై ఒక ప్ర‌క‌ట‌న ద్వారా క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ 1,2 సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారు. తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుంది. ఆ సొమ్ము బ్యాంక్ లింకేజి అయిన విద్యార్థులు/ తల్లి దండ్రుల అకౌంట్ లో మరో 20రోజుల్లో జమ అవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసలుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటగిరీలోని విద్యార్థులకు తమ వాటా నిధులు రూ.382.66 కోట్లు జమ చేసింది.

ఈ కారణంగా 9, 10 తరగతులు చదివే ఎస్సీ డే-స్కాలర్ విద్యార్థులకు సంబంధించి వారి తల్లి బ్యాంకు ఖాతాకు రూ.10,900/- , హాస్టల్ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకు రూ.8,800/- చొప్పున జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రూ.5,200/- నుండి రూ.10,972/- వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాలకు జమ చేయబడింది.

రాష్ట్రప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రకటించిన విధంగా మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వం రాబోయే 20 రోజుల్లోపు తల్లులు/విద్యార్థుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది.

Next Story