ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మిధున్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారుల సోదాలు చేపట్టారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఉన్న మిథున్ కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఒక వైపు సోదాలు చేస్తూనే మిథున్‌రెడ్డి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నివాసంలో మిధున్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన మిధున్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. మొత్తం 71 రోజుల పాటు ఈ కేసులో జైల్లో ఉన్నారు. మధ్యలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి కోరడంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.