పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వం నుండి ఆంధ్రప్రదేశ్ స‌చివాల‌యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

By Knakam Karthik
Published on : 12 Aug 2025 5:53 PM IST

Andrapradesh, Ap Government,  State Secretariat, Single-use plastic banned

పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

అమరావతి: ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వం నుండి ఆంధ్రప్రదేశ్ స‌చివాల‌యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జూన్ 5 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్లాస్టిక్ వినియోగం వ‌ల‌న మాన‌వాళికి క‌లిగే న‌ష్టాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహన కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె విజ‌యానంద్ ప్ర‌భుత్వం అధికారుల‌ను అదేశించారు.

స‌చివాల‌యంలో వివిధ శాఖ కార్య‌ద‌ర్శుల‌తో ప్లాస్టిక్ యూసేజీపై సీఎస్ స‌మీక్ష నిర్వ‌హించారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఒకసారి వాడి పడేసే వివిధ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ మంచి నీటి సీసాలు, గ్లాసులు, ప్లేట్లు, కప్పులు, స్పూన్లు, పోర్కులు, ఫినాయిల్ సీసాలు, డబ్బాలు తదితర వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సీఎస్ విజయానంద్ చర్చించారు.

Next Story