ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివలింగం ధ్వంసం..ఘటనపై సీఎం సీరియస్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 31 Dec 2025 7:34 AM IST

Andrapradesh, Konaseema district, Draksharama Bheemeswara Temple, Shivalingam destroyed, AP Police, Cm Chandrababu

ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివలింగం ధ్వంసం..ఘటనపై సీఎం సీరియస్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయం సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివలింగంపై సుత్తి వంటి మొనదేలిన ఆయుధంతో కొట్టి విరగ్గొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరించారు. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ ప్రకటించారు.

సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన కు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఘటనపై దర్యాప్తు అంశాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు

Next Story