విజ‌య‌మ్మ‌కు ష‌ర్మిల 'మదర్స్ డే' స్పెష‌ల్‌ విషెష్‌

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌కు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

By Medi Samrat  Published on  12 May 2024 11:26 AM IST
విజ‌య‌మ్మ‌కు ష‌ర్మిల మదర్స్ డే స్పెష‌ల్‌ విషెష్‌

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌కు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదిక‌గా ష‌ర్మిల త‌న పోస్టులో.. అమ్మ.. చీకటిలో వెలుగురేఖై, బాధల్లో బలానివై, అలసటతో ఆలనవై, విజయాల్లో ఆశీర్వాదానివై, దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక, నా ప్రేరణ, అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఆ పోస్టుకు తన తల్లితో దిగిన పాత ఫోటో ను కూడా జత చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ గా మారింది.

ఇదిలావుంటే.. ష‌ర్మిల క‌డ‌ప లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌చార స‌మ‌యంలో త‌న అన్న జ‌గ‌న్‌, వ‌దిన భార‌తీల‌కు వ్య‌తిరేకంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే నిన్న త‌న త‌ల్లి విజ‌య‌మ్మ ష‌ర్మిల‌కు ఓటు వేసి గెలిపించాల‌ని కోరుతూ వీడియో కూడా విడుద‌ల చేశారు. ఆ వీడియో తెగ వైర‌ల్ అయ్యింది. చివ‌రికి అమ్మ మ‌ద్ద‌తు కూడా జ‌గ‌న్ కోల్పోయార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్ధులు సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్లు కూడా చేశారు. ఈ త‌రుణంలో ష‌ర్మిల త‌న అమ్మ విజ‌య‌మ్మ‌కు చెప్పిన విషెష్ మ‌రోసారి టాఫిక్‌గా మారాయి.

Next Story