కడప లోక్ సభకు పోటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద రూ.82,58,15,000 అప్పు తీసుకున్నారు. ఆమె ఈ రోజు నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. కాగా.. ఆమె ఆస్తుల విలువ 182.82 కోట్లుగా పేర్కొన్నారు.
షర్మిల, ఆమె జీవిత భాగస్వామి అనీల్‌కు రూ.182.82 కోట్ల ఆస్తులున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన షర్మిల తన సోదరుడు వైఎస్ అవినాష్‌రెడ్డి (కడప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి)పై పోటీ చేస్తున్నారు. తన అఫిడవిట్ ప్రకారం షర్మిల జగన్ వద్ద రూ.82,58,15,000, జగన్ జీవిత భాగస్వామి వైఎస్ భారతిరెడ్డి వద్ద రూ.19,56,682 అప్పు తీసుకున్నాట్లు వెల్లడించింది.
ఆదాయం
షర్మిల: రూ.97,14,213.
జీవిత భాగస్వామి: రూ. 3,00,261.
చరాస్తులు:
షర్మిల: రూ.123,26,65,163.
జీవిత భాగస్వామి: రూ. 45,19,72,529.
స్థిరాస్తులు:
షర్మిల: రూ.9,29,58,180
జీవిత భాగస్వామి: రూ. 4,05,92,365.
అప్పులు :
షర్మిల: రూ.82,77,71,682.
జీవిత భాగస్వామి: రూ. 35,81,19,299.
షర్మిల వద్ద రూ.3,69,36,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ.4,61,90,688 విలువైన రత్నాల ఆభరణాలు ఉన్నాయి. ఆమె భర్త వద్ద రూ.81,60,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ.42,60,461 విలువైన రత్నాల ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.
ఆమె సెయింట్ అన్నా కాలేజ్ ఫర్ ఉమెన్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MBA పూర్తి చేసింది. MCC ఉల్లంఘనతో సహా ఆమెపై ఎనిమిది క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.