టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్.. సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకున్న అధిష్టానం

సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియోలు లీక‌వ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లో పెను దుమారం రేగింది

By Medi Samrat  Published on  5 Sep 2024 9:18 AM GMT
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్.. సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకున్న అధిష్టానం

సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియోలు లీక‌వ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లో పెను దుమారం రేగింది. టీడీపీ మహిళా నేతతో ఎమ్మెల్యే ఏకాంతంగా గ‌డుపుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో కలకలం రేపుతోంది. వైర‌ల్ అవుతున్న వీడియోకు సంబంధించి.. ఎమ్మెల్యే తనతో సెక్స్‌ చేయాలంటూ ఒత్తిడి చేసి పలుసార్లు లొంగదీసుకున్నాడని ఆమె ఆరోపించింది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశాడ‌ని ఎమ్మెల్యేపై ఆమె ఫిర్యాదు చేసింది. వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలంకు టికెట్‌ ఇవ్వడం మాకు ఇష్టం లేదని.. అయినా పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయ‌న గెలుపు కోసం.. తన భర్త, తాను నిర్విరామంగా కృషి చేశామని ఆమె అన్నారు.

ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదేపదే ఫోన్లు చేసి లైంగికంగా వేధించేవాడని.. సెక్స్‌ చేయాలంటూ భయభ్రాంతులకు గురిచేసేవాడని ఆమె ఆరోపించారు. భీమాస్ ప్యారడైజ్‌ హోటల్‌కు తీసుకెళ్లి తనతో బలవంతంగా సెక్స్‌ చేశాడన్నారు. అర్ధరాత్రులు ఫోన్‌ చేస్తూ వేధించేవాడని.. ఈ గమనించిన తన భర్త గ‌ట్టినా అడ‌గ‌డంతో విషయం మొత్తం చెప్పగా.. ఎమ్మెల్యేకు గట్టి బుద్ధిచెప్పాలన్న ఉద్దేశంతో.. తన భర్త ఆదేశాల మేరకు.. ఎమ్మెల్యే కోరిన రోజు ఆయన దగ్గరకు వెళ్లి సీక్రెట్ కెమెరాతో కామకలాపాలను రికార్డ్ చేసి తన భర్తకు అందించానని వెల్ల‌డించింది. పార్టీ అధినేత చంద్రబాబు చట్టపరమైన చర్యలు తీసుకుని.. తమ కుటుంబానికి రక్షణగా నిలవాలని కోరారు.

అయితే వైర‌ల్ అవుతున్న‌ వీడియో ప‌ట్ల‌ ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. నేనేంటో నా పనితనం ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నారు. కావాలనే కొందరు టీడీపీ నాయకులు నాపై కుట్ర చేశారన్నారు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ వీడియో చూస్తే మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందన్నారు.

ఇక ఈ విష‌య‌మై స్పందించిన అధిష్టానం సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంది. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఆదిమూలంపై లైంగిక వేధింపులను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామ‌ని పేర్కొంది.

Next Story