ఏపీలో పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు

ఏపీ ప్రభుత్వం పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది.

By Medi Samrat  Published on  31 Dec 2024 7:45 PM IST
ఏపీలో పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు

ఏపీ ప్రభుత్వం పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్‌, శ్రీధర్‌ లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంవో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు సీఎం కార్యదర్శిగా పదోన్నతిని కల్పించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా వీర పాండ్యన్‌ను , వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్‌లు విశ్రాంత్‌ పాటిల్‌, సిద్ధార్థ్‌ కౌశల్‌కు పదోన్నతులు కల్పించింది.

Next Story