ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వెహికల్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. జిల్లాలోని కొండాపురం
By అంజి Published on 15 May 2023 8:00 AM ISTఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వెహికల్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వెహికల్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
తుఫాన్ వెహికల్ తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. మృతులు, క్షతగాత్రులంతా తాడిపత్రి వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తుఫాన్ వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమచారాం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఇంటి బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఓ కుటుంబంపైకి కారు దూసుకెళ్లిన ఘటన యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలుడు సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.