అనుమతి ఉన్న లే అవుట్లనే రాష్ట్ర ప్రజలను కొనుగోలు చేయాలని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. త్వరలోనే అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లే అవుట్లపై ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనుమతి ఉన్న లే అవుట్ల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, వాటినే కొనుగోలు చేయాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
టాన్ ప్లానింగ్ విభాగంలో నిబంధనలను ప్రజలకు అనుకూలమైన విధంగా మార్పు చేసినట్లు, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. గతంలో మాదిరి నిబంధనలను అతిక్రమించి లే అవుట్లు ఇళ్ల నిర్మాణం చేపడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే నిబంధనలను పాటించకుండా వేసిన వెంచర్ల విషయంలోనూ రాబోయే రెండు నెలల్లో ప్రజలకు లే అవుట్ నిర్మాణ దారులు కూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు.