ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయాలు.. పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీతో పాటు..

ఏపీ కేబినెట్‌ భేటీ 4 గంటల పాటు సాగింది. సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్‌ ఆమెదం తెలిపింది.

By అంజి  Published on  24 Jun 2024 3:47 PM IST
AP Cabinet, pensions, Mega DSC, CM Chandrababu

ఏపీ కేబినెట్‌ సంచలన నిర్ణయాలు.. పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీతో పాటు..  

ఏపీ కేబినెట్‌ భేటీ 4 గంటల పాటు సాగింది. సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్‌ ఆమెదం తెలిపింది. మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, స్కిల్‌ సెన్సస్‌, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీగా మార్పునకు మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏడు శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది.

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు మంత్రి పార్థసారథి తెలిపారు. గత మూడేళ్ల నుంచి ప్రభుత్వం టెట్‌ పరీక్ష నిర్వహించలేదని దుయ్యబట్టారు. దీంతో టెట్‌లో మార్కులు మెరుగుపర్చుకునే అవకాశం అభ్యర్థులకు లేకుండా పోయిందన్నారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీని ప్రకటించారని తెలిపారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వమే తీసుకు వచ్చిందని గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి పార్థసారథి తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి, వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన చట్టానికి చాలా తేడా ఉందన్నారు. దీని వల్ల భూయజమానుల్లో భయాందోళనలు మొదలయ్యాయని, అందుకే ఈ యాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

సచివాలయ సిబ్బంది సహాయంతో ఇంటింటకీ పెన్షన్లు పంపిణీ చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. గత నెల పెన్షన్‌తో కలిపి జులై 1వ తేదీ నాడు రూ.7 వేలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆగస్టులో ఒకే రోజు 183 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆగస్టులో ఒకే రోజు 183 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు నెలలో ఒకే రోజున ఒకేసారి ప్రారంభించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. జిల్లాలకు రేపు లేదా ఎల్లుండి ఇన్చార్జిలను నియమిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.

Next Story