ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు, 2024-25 సంవత్సరం నుంచి 10వ తరగతికి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రెండు సెమిస్టర్లకు సంబంధించిన పుస్తకాలను జగనన్న విద్యా కానుక ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.