ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు. కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూకి పెంచామని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామని.. ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇస్తే, వారికి గన్ మెన్లను కేటాయిస్తామని చెప్పారు.
ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే షర్మిలపై దాడులు జరిగే ప్రమాదం ఉందన్న సంకేతాలు రావడంతో.. రాష్ట్రంలో ఆడబిడ్డకు భద్రత కల్పించలేరా అంటూ షర్మిల ప్రశ్నించారు. తనకు భద్రత కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తనకు చెడు చేయాలనే ఉద్దేశంతోనే భద్రతను కల్పించడం లేదని ఆమె ఇంతకు ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వైఎస్ షర్మిలకు భద్రతను పెంచింది. షర్మిల అభ్యర్ధన నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.