మహిళా ఉద్యోగిని ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేసిన ఘటన అల్లూరిసీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. దేవీపట్నం మండలం శరభవరం సచివాలయం వద్ద అందరూ చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మాస్క్ ధరించి మొదట లోపలికి వెళ్లారు. అనంతరం నలుగురు వ్యక్తులు దూసుకొచ్చారు. అనంతరం ఐదుగురు కలిసి మహిళా ఉద్యోగిని కారులో తీసుకెళ్లారు. అడ్డుకోబోయిన వైస్ సర్పంచ్ వెంకన్న దొరను కత్తులతో బెదిరించి మరీ మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు. సచివాలయం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తమకు ఉద్యోగిని డబ్బులు ఇవ్వాలని ఏపీ 31 టీజే1462 కారులో నేలకోట అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.