గుడ్‌న్యూస్..ఈ నెల 10న అకౌంట్లలోకి రూ.13 వేలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 3 July 2025 7:08 AM IST

Andrapradesh, Ap Governement, Thalliki Vandanam, Students

గుడ్‌న్యూస్..ఈ నెల 10న అకౌంట్లలోకి రూ.13 వేలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రెండో విడత తల్లికి వందనం నగదును ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలుచేశారు. రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరిన వారికి జూలై 5న నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది.

కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈనెల 10న మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా, ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్‌ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టిన లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, అర్హత సాధించినవారి పేర్లు రెండవ జాబితాలో పొందుపరిచారు.

జూలై 5, 2025న ఉదయం నుంచి అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.13,000 డిపాజిట్ అవుతుంది. మొత్తం రూ.15,000లలో ఇది ప్రధాన భాగం కాగా, మిగిలిన రూ.2,000 పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం కట్ చేస్తుంది.

Next Story