Andhrapradesh: స్కూళ్ల టైమింగ్స్‌ మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే

రాష్ట్రంలో ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సాయంత్రం 5 గంటల వరకు విద్యాశాఖ పొడిగించింది.

By అంజి  Published on  18 Nov 2024 7:35 AM IST
School timings, Andhra Pradesh, APnews, APgovt

Andhrapradesh: స్కూళ్ల టైమింగ్స్‌ మార్పు.. కొత్త షెడ్యూల్‌ ఇదే

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సాయంత్రం 5 గంటల వరకు విద్యాశాఖ పొడిగించింది. ఇప్పటి వరకు ఆప్షనల్‌గా ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది. ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైమ్‌ టేబుల్‌ను ప్రయోగత్మకంగా తొలుత ప్రతి మండలంలోని 2 బడుల్లో అమలు చేయనుంది. దీని ప్రకారం.. ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్‌ సమయాన్ని 5 నిమిషాల చొప్పున, భోజన విరామాన్ని 15 నిమిషాలు పెంచారు.

ఉదయం తొలి పీరియడ్‌ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. తర్వాతి 3 పీరియడ్లను కూడా 5 నిమిషాల చొప్పున పెంచి 45 నిమిషాలు చేశారు. తాజా టైమింగ్‌ మార్పులతో రోజులో స్కూల్ సమయం గంట పెరగనుంది. సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కి అభిప్రాయాలు నివేదించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్నీ స్కూళ్లలో అమలు విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Next Story