సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సులు జనవరి 9 నుండి 13 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సులలో సాధారణ ఛార్జీలు ఉంటాయి. అదనపు ఛార్జీలు వసూలు చేయబడవని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది.
అటు సంక్రాంతి పండుగకు 5 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఏయే రూట్లలో ఇవి నడుస్తాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి.