జీఎస్టీ ప్రభావంతో జోరందుకున్న వాహనాల అమ్మకాలు.. మంత్రి ప్ర‌క‌ట‌న‌

రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందాని, పన్ను భారం తగ్గడంతో

By -  Medi Samrat
Published on : 24 Sept 2025 4:47 PM IST

జీఎస్టీ ప్రభావంతో జోరందుకున్న వాహనాల అమ్మకాలు.. మంత్రి ప్ర‌క‌ట‌న‌

రాష్ట్రంలో నూతనంగా అమలైన జీఎస్టీ విధానం వాహనాల అమ్మకాలకు ఊతమిచ్చిందాని, పన్ను భారం తగ్గడంతో ప్రజలు కొత్త వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారని రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 2,991 వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందాయని తెలిపారు. వీటిలో మోటార్ సైకిళ్లు 2,352, కార్లు/క్యాబ్‌లు 241, ట్రాక్టర్లు 60, ఆటోలు 227, గూడ్స్ వాహనాలు 47, ఆటో గూడ్స్ వాహనాలు 50, ఇతర వాహనాలు 12 ఉన్నాయి.

ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ వేగం పెరుగుతుందని త్వరలోనే రోజుకు 4,000 వాహనాల రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

Next Story