చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. వైసీపీకి వారే బలం
Sajjala Ramakrishnareddy Fire On Chandrababu. చంద్రబాబు స్వార్థ పూరిత రాజకీయ నాయకుడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
By Medi Samrat Published on 1 July 2022 5:48 PM ISTచంద్రబాబు స్వార్థ పూరిత రాజకీయ నాయకుడని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. 2014-19 మధ్య ఆరచకాలకు,అవినీతికి, మాఫియాలకు టీడీపీ సహకరించిందని ఆరోపించారు. విజయవాడ అబివృద్దికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తిచేసింది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణం తో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టినట్టయిందని అన్నారు. 42 గుడులు కూలగొట్టినన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ధర్మ పోరాట దీక్షపేరుతో టీడీపీ దోపిడీకి తెర తీసిందని అన్నారు.
మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రం అంతటా టీడీపీని ప్రజలు తరిమి కొట్టారని అన్నారు. అమరావతి పేరుతో ప్రజలను మభ్య పెట్టే యోచన చేసిందని.. రాజధానిని నూజివీడు దగ్గర మొదలు పెట్టీ అమరావతి దగ్గర ఆపారని అన్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా చంద్రబాబు చర్యలు ఉన్నాయని అన్నారు. మద్యంలో విషం ఉందని విష ప్రచారం చేస్తున్నారని.. ఇంత దారుణమైన ప్రతిపక్షం దేశంలోనే లేదని ఫైర్ అయ్యారు.
తెలుగుదేశం హయాంలో దోపిడీకే పెద్ద పీట వేశారని.. వైఎస్సార్సీపీ నేడు మారీచులతో యుద్ధం చేస్తోందని అన్నారు. అబద్ధాలు, అవరోధాలతో టీడీపీ ముందుకు పోతోందని.. జగన్ అమలు పరచిన పథకాల వలన అన్ని పార్టీల వాళ్ళు లబ్ధి పొందారని తెలిపారు. దళితులు, ఆగ్ర వర్ణ పేదలు అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
అన్న కాంటీన్ పేరుతో కూడా దోపిడీ చేశారని.. సంక్షేమ పథకాల అమలు ముందే ప్రజలకు తేలియపరిచే విధంగా కేలండర్ విడుదల చేశామన్నారు. చంద్రబాబు లాగా ఎలా దోచుకోవాలన్న ఆలోచన జగన్ కు లేదని.. 95 శాతం మానిఫెస్టో అమలు పరచిన సర్కార్ జగన్ సర్కార్ అని అన్నారు. అమ్మఒడితో జగన్ పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేశారన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపే విధంగా జగన్ పాలన ఉందని అన్నారు. రానున్న ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని.. వైఎస్సార్సీపీ పార్టీ కి ప్రజలు, కార్యకర్తలే బలం అని అన్నారు.