ఆ హక్కు ఎవరికీ లేదు.. హ‌రీష్ కామెంట్స్‌పై స్పందించిన‌ స‌జ్జ‌ల

Sajjala Ramakrishna Reddy Reponds On Harish Rao Comments. గడప గడపకు కార్యక్రమానికి స్పందన బాగుందని ఏపీ ప్ర‌భుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  30 Sept 2022 3:05 PM IST
ఆ హక్కు ఎవరికీ లేదు.. హ‌రీష్ కామెంట్స్‌పై స్పందించిన‌ స‌జ్జ‌ల

గడప గడపకు కార్యక్రమానికి స్పందన బాగుందని ఏపీ ప్ర‌భుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. మేం చేసిన పనుల‌పై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నామ‌న్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామ‌ని.. అమలు చేసిన పథకాల ప‌ట్ల‌ ప్రజల స్పందన బాగుందని ఆయ‌న అన్నారు. ప్రతి అంశాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేయడం టీడీపీ పని అని విమ‌ర్శించారు.

అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ సూచించారని.. వాస్తవాలను వక్రీకరించి టీడీపీ, ఎల్లోమీడియా ప్రచారం చేస్తున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదని.. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎందుకలా మాట్లాడారో మాకు తెలియదని.. వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా మాపై కామెంట్స్ చేయ‌డం సరికాదని సూచించారు.

ఇదిలావుంటే.. టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్స్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందన్నారు. తెలంగాణలో ఉపాధ్యాయులకు మంచి ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్నారు. జగన్‌లా కేంద్రం మాటకు ఒప్పుకుని ఉంటే ఏటా 6 వేల కోట్లు వచ్చేవన్నారు. ఈ డబ్బులతో మరికొన్ని పథకాలు పెట్టేవాళ్లమన్నారు హరీశ్‌రావు.


Next Story