ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంలో ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది : సజ్జల

Sajjala Ramakrishna Reddy Fire On Yellow Media. ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంలో ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు

By Medi Samrat  Published on  23 May 2023 3:40 PM IST
ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంలో ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది : సజ్జల

ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంలో ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తల్లికి బాగాలేదంటే డ్రామాలని అంటారు. ఇలా చేస్తే కడుపుమండకుండా ఉంటుందా? మీ మీద కూడా ఇలానే రాస్తే ఒప్పుకుంటారా? అని నిలదీశారు. అవినాశ్ రెడ్డి ఇప్పటిదాకా ఆరేడు సార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన సహకరిస్తున్నారు. ఎక్కడికీ పారిపోలేదు. ఆయన తల్లికి బాగాలేదు. తండ్రి జైలులో ఉన్నారు. అందుకే విచారణకు రాలేనని లేఖ రాశారు. ఈ విషయంలో ఏం జరిగినా.. అది సీబీఐకి, ఆయనకు మధ్య జరిగే వ్యవహారం. పోలీసులతో మాట్లాడి సీబీఐ అధికారులు వాళ్ల పని వాళ్లు చూసుకుంటారని తెలిపారు. ఎల్లో మీడియా మాత్రం.. పారమిలిటరీ ఫోర్సెస్ వస్తున్నాయని రాస్తారు. ఎక్కడొస్తున్నాయి బలగాలు? వస్తున్నాయని మీరే రాస్తారు? మళ్లీ బలగాలు రాకుండా ఏదో చేశారనీ రాస్తారు. ఏదో భయకరమైనది జరుగుతున్నట్లు రాసి.. మళ్లీ ఏమీ జరగలేదని రాస్తారు. కథ మీరు సృష్టిస్తారు.. ఆరోపణలు మీరే చేస్తారని అన్నారు. వైఎస్సార్ సీపీకి ఎవరూ లేరనుకుంటున్నారా? కార్యకర్తలు, అభిమానులు కోట్ల మంది ఉన్నారు. ఏదో జరిగిపోతోంది.. కొంపలు అంటుకుపోతున్నాయి అని రాస్తే ఆసుపత్రి దగ్గరికి రాకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డి వెంటపడాల్సిన అవసరమేంటి? ఆయనేమైనా అండర్ గ్రౌండ్ నుంచి ఆ రోజే బయటికి వచ్చారా? నెల నుంచి కనపడకుండా, పారిపోయి బయటికి వచ్చారా? బెంగళూరు వైపు వెళ్లారా? ఇంకోవైపు వెళ్తారా? అంటూ ఊహాగానాలు ఎందుకు? ఏం పరారవుతున్నారా? ఇలాంటి వార్తలు రాసి, అభిమానుల ఎదుటో, ఇంకెవరి ఎదుటో మీరు కనిపిస్తే ఎవడో రియాక్ట్ అయ్యి దాడి చేస్తాడని చెప్పారు. ఎవరైనా కాస్త ఆవేశానికి లోనైతే మీడియా మీద దాడి అంటున్నారు. ఎవరైతే కరుడు గట్టిన వారు ఉంటారో వాళ్లకు ఆవేశం వస్తుందని అన్నారు.


Next Story