చంద్రబాబు నుంచే ఈ కుంభకోణం ఆలోచన మొదలైంది : సజ్జల

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై

By Medi Samrat  Published on  20 Nov 2023 7:53 PM IST
చంద్రబాబు నుంచే ఈ కుంభకోణం ఆలోచన మొదలైంది : సజ్జల

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. స్కిల్ కేసులో చంద్రబాబే సూత్రధారి అని.. కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చారని గుర్తు చేశారు. ఆయన నుంచే ఈ కుంభకోణం ఆలోచన మొదలైందని, ఆయన ఆమోదంతోనే స్కిల్ వ్యవహారంలో నియామకం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ఆమోదంతోనే నిధులు విడుదల అయ్యాయని ఆరోపించారు. తాను చెప్పి, ఒత్తిడి తీసుకువచ్చి బ్యాంకు గ్యారెంటీల నుంచి సదరు కంపెనీలకు మినహాయింపులు ఇచ్చేలా చేశాడన్నారు. ఇన్ని చేసిన చంద్రబాబు ఏ1 కాక మరెవరు? అని సజ్జల ప్రశ్నించారు. రాజకీయంగా చంద్రబాబు ఎంతగా బయట తిరిగితే అంత మంచిది. ఆయనలోని డొల్లతనం అందరికీ కనిపిస్తుందన్నారు. ఇచ్చింది కేవలం బెయిల్ మాత్రమేనని అందరూ గుర్తించాలన్నారు

చంద్రబాబు నాయుడులోని మోసగాడు ప్రత్యక్షంగా కళ్ల ముందు కనిపిస్తుంటాడన్నారు సజ్జల. ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చాయి కాబట్టి జనాలు కూడా నిలదీస్తారన్నారు. చంద్రబాబు ఇప్పటికే ఒకరిని దేశం దాటించారు. ఈ కేసు నిలబడేందుకు అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చూసుకుంటారన్నారు.

Next Story