అంబటి రాయుడు, షర్మిలపై సజ్జల కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  6 Jan 2024 5:53 PM IST
అంబటి రాయుడు, షర్మిలపై సజ్జల కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వైఎస్ షర్మిల సొంత అన్న పార్టీని కాదనుకుని, ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ చెంతన చేరారు. ఇక కొద్దిరోజుల కిందటే వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఊహించని విధంగా రాజకీయాలకు దూరమవుతూ ఉన్నానని తేల్చి చెప్పారు. ఈ పరిణామాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు. ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.

సీఎం జగన్‌కు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమని తేల్చిచెప్పారని సజ్జల అన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ కుటుంబం కోసం పెట్టలేదని అన్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకుంటే, మా విధానాలు మాకు ఉన్నాయని స్పష్టం చేశారు. అంబటి రాయుడి పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో తెలియదన్నారు. కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని మాత్రమే చెప్పారని తెలిపారు.

Next Story