రొట్టెల పండుగ నిర్వహణకు రూ.5 కోట్లు: సీఎం చంద్రబాబు

నెల్లూరు జిల్లా బారాషహీద్‌లో మూడో రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు.

By అంజి  Published on  19 July 2024 7:09 AM GMT
Rottela panduga, festival, CM Chandrababu, Nellore

రొట్టెల పండుగ నిర్వహణకు రూ.5 కోట్లు: సీఎం చంద్రబాబు

అమరావతి: ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా బారాషహీద్‌లో మూడో రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పండుగ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బారాషాహీద్ దర్గా దగ్గర గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. రొట్టెల పండుగలో ఇది ప్రధాన ఘట్టం. గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి 12 బిందెలలలో గంధాన్ని ఊరేగింపుగా బారాషాహిద్ దర్గా వరకు తీసుకువచ్చారు. అమీనియా మసీదు వద్ద గంధం కలిపే కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. గంధం ఊరేగింపుగా ఈద్గా వద్దకు చేరుకోగా, అక్కడ ఫకీర్ల విన్యాసాల అనంతరం దర్గాలోకి తీసుకువెళ్లారు. భారీగా తరలివచ్చిన భక్తులు గంధాన్ని అందుకునేందుకు పోటీపడ్డారు. కాగా స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు మార్చుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. బారాషహీద్ దర్గా వద్ద భక్తుల తొక్కిసలాట జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Next Story