నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Road Accident in Nellore District.నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2021 6:18 AM GMT
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ‌గా.. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న మ‌ర్రిపాడు మండ‌లం ఎపిల‌గుంట వ‌ద్ద జరిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. శ‌నివారం తెల్లవారుజామున మ‌ర్రిపాడు మండ‌లం ఎపిల‌గుంట వ‌ద్ద మ‌ద‌న‌ప‌ల్లి వైపు నుంచి వ‌స్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారులో ప్ర‌యాణిస్తున్నవారిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it