నారా లోకేష్ పై ఆర్జీవీ తీవ్ర విమర్శలు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 25 Aug 2023 3:52 PM ISTవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోకేశ్.. నేను థర్డ్ గ్రేడా? ఫిఫ్త్ గ్రేడా? అన్నది ముఖ్యం కాదు.. నా ప్రశ్న ఏంటంటే.. మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగం చేసేవారు. అక్కడి నుంచి నాకు నేనుగా సినిమాల్లోకి వచ్చి డైరెక్షన్ చేశానని అన్నారు. హిట్లు తీశాను, ఫ్లాపులు, సూపర్ ఫ్లాపులు కూడా తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు అనే పెద్ద నాయకుడికి పుట్టారు. ఆయన మిమ్మల్నే కనాలనుకోలేదు, కానీ మీరు పుట్టారు. దాన్ని బయాలజికల్ యాక్సిడెంట్ అంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. మీరేం సాధించారు? నేనేం సాధించాను? అనేది పక్కపక్కనే ఓ జాబితా తయరు చేసుకుని చూసుకోండని అన్నారు.
అయినా నేను థర్డ్ గ్రేడ్ అంటే మరి మీరేం గ్రేడో..! మీ తండ్రిని పక్కనపెట్టేస్తే మీరు అరవడం తప్పిస్తే ఏం చేశారు? అనేది నాకింతవరకు అర్థం కాలేదని ఆర్జీవీ చెప్పారు. మీరు రాజకీయ నాయకులు.. మీ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలియదు. ప్రతిరోజు వందల సినిమా షూటింగ్స్ జరుగుతాయి. నాకొక్కరికే కాదు, అందరికీ షూటింగ్‌కు అనుమతి ఇస్తారు. షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదని తెలిపారు.