బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై వ‌ర్మ కామెంట్స్‌

నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఇటీవల ఏపీ రాజకీయాలపై మాట్లాడారు.

By Medi Samrat  Published on  17 Sept 2023 7:30 PM IST
బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై వ‌ర్మ కామెంట్స్‌

నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఇటీవల ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. దీంతో ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. స్కిల్ స్కీం కేసులో నారా బ్రాహ్మణికి.. తన భర్త లోకేషో.. మరెవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని వర్మ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బ్రాహ్మణి తొందరపడి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే సువర్ణావకాశాన్ని చేజార్చుకోవద్దని వర్మ సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా శనివారం రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని.. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేం ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి చేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతను జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు లక్షలాదిమంది యువతకు నైపుణ్యం మెరుగు పర్చేలా కృషి చేశారన్నారు బ్రాహ్మణి.

Next Story