ఏపీపీఎస్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొత్త ఛైర్మన్‌గా మాజీ IPS అధికారి AR అనురాధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించింది

By Medi Samrat  Published on  23 Oct 2024 1:57 PM GMT
ఏపీపీఎస్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అనురాధ నియామకం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొత్త ఛైర్మన్‌గా మాజీ IPS అధికారి AR అనురాధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అనుమతితో బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా అనురాధ నియామ‌క‌ జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా IPS అధికారిగా అనురాధ గుర్తింపు పొందారు. ఆమె విస్తృతమైన అనుభవంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, అలాగే పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP), ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) వంటి ముఖ్యమైన పదవులు నిర్వ‌ర్తించారు.

అనురాధ నియామకానికి ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సుముఖత తెలుపడంతో ఆమెను నియమించినట్లు సమాచారం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. మరో ఏడాది పదవీ కాలం ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే సవాంగ్‌ ఏపీపీఎస్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Next Story