పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్ ఖరారు
2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి) వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.
By Medi Samrat
2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి) వైద్య విద్య కోర్సుల ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు.
2028-29 సంవత్సరంలో ప్రభుత్వాసుపత్రుల్లో క్లినికల్ మరియు నాన్ -క్లినికల్ స్పెషలిస్టుల అవసరాలను మదింపు చేసి ప్రభుత్వం రిజర్వేషన్ కోటాపై నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో (పి హెచ్ సీ లు ) పనిచేసే వైద్యుల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ కోటా విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు.
7 క్లినికల్ కోర్సుల్లో 15%రిజర్వేషన్
2025-26 సంవత్సరంలో జరిగే పి. జి. వైద్య విద్య కోర్సుల్లో జరిగే ప్రవేశాలల్లో 7 క్లినికల్ సబ్జెక్టుల్లో ప్రభుత్వ పిహెచ్ సీ వైద్యులకు 15%రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్స్, గైనకాలజీ, ఎనస్తీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు రైడియాలజీ కోర్సుల్లో ఈ మేరకు రిజర్వేషన్ కల్పించారు. మొత్తం 17 కోర్సుల్లో పి. జి ప్రవేశాలు జరుగుతాయి.
9 నాన్ -క్లినికల్ కోర్సుల్లో 30% రిజర్వేషన్
ప్రవేశాలు జరిగే మొత్తం 9నాన్ - క్లినికల్ కోర్సులో 30%రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విభాగాలు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయో కెమిస్ట్రీ, ఏనాటమీ, ఫిజీయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, మైక్రో్బయాలజీ, పాథాలజీ, సోషల్ & ప్రివెంటివ్ మెడిసిన్.
ప్రభుత్వ వైద్యుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం - మంత్రి
1144 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే 2288 వైద్యుల ఆశలు, ఆకాంక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ పై నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శి తో కూడిన ఆరుగురు ఉన్నతాథికారుల కమిటీ 2028-29 సంవత్సరంలో స్పెషలిస్ట్ ల అవసరం పై మదింపు చేసి వివిధ విభాగాల్లో అవసరాలను గుర్తిస్తూ నివేదిక ఇచ్చిందని మంత్రి వివరించారు. ఉన్నత విద్య పాందాలనే ప్రభుత్వ వైద్యుల ఆశలు, ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని అవసరాల కంటే ఎక్కువగా ప్రభుత్వ వైద్యులకు పి.జి కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి వెల్లడించారు.
మొత్తం 272 పి. జి సీట్ల లభ్యత
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా ) కింద లభించే 50% పి.జి కోర్సుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ కోటా మేరకు ప్రభుత్వ వైద్యులకు ప్రవేశాలు లభిస్తాయి. 15%రిజర్వేషన్ ప్రకారం 7 క్లినికల్ విభాగాల్లో 154 సీట్లు, 9 నాన్ -క్లినికల్ విభాగాల్లో 30%రిజర్వేషన్ మేరకు 118 సీట్లు ప్రభుత్వ వైద్యులకు అందుబాటులో ఉంటాయి. ఈ విథంగా మొత్తం 272 సీట్లను ప్రభుత్వం పీ హెచ్ సి వైద్యులకు `కేటాయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో జరిగిన పిజి వైద్య విద్య ప్రవేశాల్లో 312 మంది ప్రభుత్వ వైద్యులు ప్రవేశాలు పొందారు.
వైద్యుల డిమాండ్ కు అంగీకారం
ప్రభుత్వ వైద్యుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. గతానికి భిన్నంగా మూడవ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తయ్యేవరకు పజి కోర్సుల్లో ప్రభుత్వ వైద్యులకు ప్రవేశాలను కల్పించాలన్న డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటి వరకు.. రెండవ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత ప్రభుత్వ వైద్యులకు కేటాయించిన సీట్లలో మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయించేవారు. ఈ సంవత్సరం జరిగే ప్రవేశాల్లో.. మూడవ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు
ప్రభుత్వ పిహెచ్ సి ల్లో 3 సంవత్సరాల సర్వీసు చేసిన వైద్యులు పిజి కోర్సుల్లో రిజర్వేషన్ కోటాలో ప్రవేశాలు పొందేందుకు అర్హులు