75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహించింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో సీఎం జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. ప్రభుత్వం తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించింది. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్, సీఆర్పీఎఫ్ కంటింజెంట్, తమిళనాడు స్టేట్ పోలీస్ స్పెషల్ కంటింజెంట్ సహా.. కొన్ని కంటింజెంట్‌లను గవర్నర్ రివ్యూ చేశారు.
అటు అసెంబ్లీ ఆవరణలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనమండలిలో మండలి చైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి జెండా ఆవిష్కరించారు.
ఇదిలా ఉంటే.. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర శుభాకాంక్షలు తెలిపారు.