Andhrapradesh: 'ఆ విషయం పోలీసులనే అడగండి'.. ఆర్జీవీకి హైకోర్టులో నిరాశ

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

By అంజి  Published on  18 Nov 2024 1:15 PM IST
film director, Ram Gopal Varma, AP High Court, APnews

Andhrapradesh: 'ఆ విషయం పోలీసులనే అడగండి'.. ఆర్జీవీకి హైకోర్టులో నిరాశ

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలన్న ఆర్జీవీ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. పోలీసుల విచారణకూ సమయం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరగా, ఆ విషయం పోలీసులనే అడగాలని న్యాయస్థానం బదులు ఇచ్చింది.

కేసు వివరాల్లోకి వెళ్తే... గత ఎన్నికలకు ముందు 'వ్యూహం' చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Next Story