మార్కెట్‌లో రికార్డు ధర పలుకుతోన్న టమాటా.. కారణం అదేనటా.!

Record price tomato in the market. టమాటా ధరలు మరోసారి ఆకాశన్నంటాయి. కూరగాయల మార్కెట్‌లో కిలో టమాటా ధర రికార్డు ధరలు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ

By అంజి  Published on  6 Dec 2021 5:40 AM GMT
మార్కెట్‌లో రికార్డు ధర పలుకుతోన్న టమాటా.. కారణం అదేనటా.!

టమాటా ధరలు మరోసారి ఆకాశన్నంటాయి. కూరగాయల మార్కెట్‌లో కిలో టమాటా ధర రికార్డు ధరలు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో కూరగాయాల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కిలో టమాటా ధర రూ.120 చేరగా.. బహిరంగ మార్కెట్లలో కూడా రూ.150కిపైగా పలికింది. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో టమాటా ధర దిగింది. కానీ ఇప్పుడు మరోసారి టమాటా ధరలు పెరిగాయి. చిత్తూరు జిల్లా మదనపల్లో కూరగాయల మార్కెట్‌లో కిలో టమాటా ధర సెంచరీ దాటింది. సోమవారం మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.102గా పలుకుతోంది. ఇక బహిరంగ మార్కెట్‌కు వెళ్లి.. అది వినియోగదారుడి చేతికి చేరే సరికి ధర మరింత పెరుగుతుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో టమాటా కొనుగోలు చేయాలంటేనే భయం వేస్తోంది. మదనపల్లె మార్కెట్‌ నుండి ఏపీతో పాటు, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. మంచి నాణ్యమైన టమాటా ఈ సంవత్సరం ఆరంభంలో కిలో రూ.6 చొప్పున విక్రయించారు. ఆ తర్వాత వర్షాలకు ముందు టమాటా ధర రూ.50కి పైగా పలికింది. అప్పటికే వర్షాలు భారీగా కురవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో టమాటా ధర అమాంతం పెరిగిపోయింది. టమాటా సెంచరీ దాటడానికి ప్రధాన కారణం దిగుబడి లేకపోవడమేనని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం అన్ని కూరగాయలకు ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడు కూరగాయలు కొనడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Next Story