ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

By -  Medi Samrat
Published on : 24 Jan 2026 12:00 PM IST

ప్రసాదం కౌంటర్‌లో ఎలుకలు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

అన్నవరం హైవేపై ఉన్న ప్రసాదం కౌంటర్ లో ఎలుకలు చక్కర్లు కొడుతూ ఇటీవల కనిపించాయి. సత్యదేవుని నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్‌లో భక్తులకు విక్రయించే ప్రసాదం పొట్లాలపై ఎలుకలు పరుగులు తీయడం వివాదాస్పదమైంది. ఆ కౌంటర్‌లోని సిబ్బందిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌ కావడంతో దీనిపై దేవదాయ శాఖ మంత్రి పేషీ నుంచి దేవస్థానం అధికారులను వివరణ కోరారు.

ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు తిరిగిన ఘటనపై అధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపించారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ ఉత్తర్వులను జారీ చేశారు.


Next Story