గుడ్‌న్యూస్..మే 15 నుంచి వాట్సాప్ గవర్నన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ
మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..మే 15 నుంచి వాట్సాప్ గవర్నన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ
మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా లోటుపాట్లు లేుండా అవకతవకలు జరగకుండా మొత్తం వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరిచాలని పౌరసరఫరాల అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాల్సి ఉందని తెలిపారు. ఎక్కడా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైస్ కార్డులో పేర్లు నమోదు అయినప్పటికీ.. జీఎస్‌డబ్ల్యూఎస్ డేటాలో లేని 79,173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి సరి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1,46,21,223 రైస్ కార్డులు ఉండగా.. అందులో 4,24,59,028 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే 3.94 కోట్ల మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేయించుకున్నారని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇంకా 23 లక్షల మంది ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉందని..0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు, అలాగే 80 ఏళ్లకు పైబడిన వారికి ఈ-కేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చామని చెప్పారు. వచ్చే నెల 30వ తేదీ కల్లా రాష్ట్రంలో అందరికీ ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
మరో వైపు ఈ నెల 7వ తేదీ నుంచి కొత్త రైస్ కార్డులకు అప్లయ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో పాటు స్పిట్లింగ్, అడిషన్, డిలీషన్, సరెండర్, అడ్రస్ మార్పు, అప్డేషన్ వంటి 7 సర్వీసులను అందుబాటులోకి తేవడంతో.. దీనికి విశేష స్పందన లభిస్తోందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.