కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం.. తొలిసారి స్పందించిన అవ‌త‌లి వ్య‌క్తి

Rama Shiva Reddy About Kotamreddy Sridhar Reddy Issue. తన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు

By Medi Samrat  Published on  8 Feb 2023 6:05 PM IST
కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం.. తొలిసారి స్పందించిన అవ‌త‌లి వ్య‌క్తి

తన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! తన మిత్రుడు రామశివారెడ్డికి చేసిన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో రామశివారెడ్డి స్పందించారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ కాలేదని, కాల్ రికార్డ్ మాత్రమే అయిందని చెప్పారు. తన వెనుక ఎవరూ లేరని, రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడటం ఇష్టం లేకే స్వయంగా ముందుకు వచ్చి నిజం చెపుతున్నానని అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ కు సంబంధించి ఇద్దరం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నామని, అది ఫోన్ లో యాదృచ్చికంగా రికార్డ్ అయిందని తెలిపారు. దీనిపై కావాలంటే కేంద్ర హోంశాఖకు, సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. తనది ఐఫోన్ కాదని, ఆండ్రాయిడ్ ఫోన్ అని తెలిపారు. తాను ఎవరో సీఎం జగన్ కు తెలియదని చెప్పారు.

కోటంరెడ్డి ఇప్పటికే దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం కోటంరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిస్తున్నానని, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్పినప్పటి నుంచి వైసీపీ నేతలు టార్గెట్ చేశారని ఆరోపించారు.


Next Story