ఒంగోలుకు రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు.
By Medi Samrat Published on 6 Feb 2025 9:15 PM IST![ఒంగోలుకు రామ్ గోపాల్ వర్మ ఒంగోలుకు రామ్ గోపాల్ వర్మ](https://telugu.newsmeter.in/h-upload/2025/02/06/394156-ram-gopal-varma-will-attend-the-police-inquiry-in-ongole-tomorrow.webp)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. పోలీసుల విచారణ కోసం రామ్ గోపాల్ వర్మ వస్తుండడంతో అటు చిత్ర పరిశ్రమలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ వర్మపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. ఒంగోలు రూరల్ పీఎస్ లో నమోదైన ఈ కేసులో వర్మ ఫిబ్రవరి 7న విచారణకు హాజరవనున్నారు.
ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ వర్మకు ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను 7వ తేదీన విచారణకు వస్తానని, వర్మ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విచారణ అధికారి సీఐ శ్రీకాంత్ కు సమాచారం అందించారు. అధికారుల అనుమతి మేరకు వర్మ ఒంగోలులో విచారణకు హాజరు కానున్నారు.
Next Story