రాహుల్ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల

Rahul pays tributes to YSR, Sharmila thanks him. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్)

By Medi Samrat  Published on  8 July 2023 10:18 AM GMT
రాహుల్ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్) జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ట్విట‌ర్‌లో వైఎస్ఆర్‌ను “ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనిక నాయకుడుగా.. ఆయన ఎప్పటికీ స్మరించబడతారని రాహుల్ ట్వీట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి వైఎస్ఆర్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేసింది. తన హయాంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడు వైఎస్ఆర్ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆంధ్రా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. ప్రజాజీవితానికి, కాంగ్రెస్‌ పార్టీకి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గౌరవించబడుతుంది’ అని ఖర్గే తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే.. రాహుల్ గాంధీకి షర్మిల వెంటనే కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. దివంగిత ముఖ్యమంత్రి వైయస్సార్ ను స్మరించుకుంటూ మీరు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మిన ఒకే ఒక వ్యక్తి వైయస్సార్. కాంగ్రెస్ పార్టీలో నిబంధిత కలిగిన నాయకుడిగా ఉంటూ తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేశారు. వైయస్సార్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. వైయస్సార్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

రెండు పార్టీల మధ్య కొంతకాలంగా విలీనానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, సరైన సమయంలో అధికారిక ప్రకటన వస్తుందని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. షర్మిల త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నార‌నే స‌మాచారం ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ రామచంద్రరావు గ‌త‌ సోమవారం వ్యాఖ్యానించారు.


Next Story