రఘురామకు మరో షాక్ తప్పదా.?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు చిక్కుల్లో పడ్డారా? అయితే ఇదేదో పొలిటికల్ మ్యాటర్ అని అనుకోకండి. ఆయన మీద సుప్రీం కోర్టును ఆశ్రయించింది సీబీఐ

By Medi Samrat  Published on  15 April 2024 2:30 PM IST
రఘురామకు మరో షాక్ తప్పదా.?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు చిక్కుల్లో పడ్డారా? అయితే ఇదేదో పొలిటికల్ మ్యాటర్ అని అనుకోకండి. ఆయన మీద సుప్రీం కోర్టును ఆశ్రయించింది సీబీఐ. రఘురామ కృష్ణంరాజు బ్యాంకులకు మోసం చేసిన కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామ కృష్ణంరాజు బ్యాంకులను మోసం చేసిన కేసు దర్యాప్తుపై ప్రస్తుతం స్టే కొనసాగుతూ ఉంది. అయితే ఈ స్టేను ఎత్తి వేయాలని సుప్రీంకోర్టును కోరింది సీబీఐ. బ్యాంకులకు రుణం ఎగవేత కేసుపై దర్యాప్తు కొనసాగిస్తామని.. క్రిమినల్‌, సివిల్‌ కేసులపై కూడా దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. నాన్‌ మిసిలేనియస్‌ రోజుల్లో విచారణ జరిపాలని రఘురామ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.

రఘురామ కృష్ణంరాజు థర్మల్‌ పవర్‌ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ కోసం నిధులు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ఇతర బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారని.. వేరే వాటికి డబ్బులను మళ్లించారని సీబీఐ ఆరోపిస్తూ ఉంది. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా.. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. రఘురామ స్టే తెచ్చుకున్నారు.

Next Story