'పుష్ప-2': వైసీపీ - జనసేన మధ్య ఫ్లెక్సీ వార్
'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా పలుచోట్ల వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది.
By అంజి Published on 5 Dec 2024 11:47 AM IST'పుష్ప-2': వైసీపీ - జనసేన మధ్య ఫ్లెక్సీ వార్
'పుష్ప-2' సినిమా విడుదల సందర్భంగా పలుచోట్ల వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది. చిత్తూరు జిల్లా పాకాలలో శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద జనసేన, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. పుష్ప-2 సినిమాకు సపోర్ట్‌గా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బన్నీతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. '2029 సీఎం (జగన్) గారి తాలూకా, మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే (చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి) గారి తాలూకా' అని ఓ వ్యక్తి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీన్ని జనసేన అభిమానులు చించేశారు.
దీంతో థియేటర్ వద్ద ఇరువర్గాలు బాహాబాహీకు దిగాయి. అనంతపురం జిల్లా గుత్తిలోనూ వైసీపీ అభిమానుల ఫ్లెక్సీలను తొలగించారు. అటు పుష్ప-2 సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించారు. 'పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా.. కాదు వరల్డ్ ఫైర్' అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. పుష్ప-2 తెలుగు వారికి పేరు తేవాలని మరో పోస్టులో ఆకాంక్షించారు. ఈ సినిమాను అడ్డుకోవడం ఎవరివల్లా కాదని పరోక్షంగా జనసేన శ్రేణులపై ఆయన ఇటీవల సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.