వైఎస్ వివేకా హత్య కేసు.. తులసమ్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పులివెందుల కోర్టు

Pulivendula court records Tulasamma's statement. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని

By M.S.R  Published on  25 March 2023 7:45 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు.. తులసమ్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పులివెందుల కోర్టు

YS Vivekananda Reddy


మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. ఈ హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని కేసు విచారణలో సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కోర్టులో తులసమ్మ పిటిషన్ వేశారు. ఈ కేసులో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాశ్ రెడ్డిని కూడా విచారించాలని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. గత నెల 21న పులివెందుల కోర్టులో ఆమె ప్రైవేటు కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది. సాక్షిగా వివేకా పీఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.

ఇక వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. కేవలం దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే సీబీఐ విచారిస్తోందని.. ఈ కేసుతో తనకుఎలాంటి సంబంధం లేదన్నారు. తనను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారని ఆరోపించారు.


Next Story