వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇంకా ఆరుగురిని విచారించాలి : తులసమ్మ

Pulivendula court records Tulasamma’s statement. వైఎస్‌ వివేకా హత్య కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య

By M.S.R  Published on  26 Nov 2022 9:00 PM IST
వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇంకా ఆరుగురిని విచారించాలి : తులసమ్మ

వైఎస్‌ వివేకా హత్య కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో హాజరయ్యారు. గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ ఆక్షేపించారు. మరో ఆరుగురిని సీబీఐ విచారించాలని సీబీఐని తులసమ్మ కోరారు. వివేకా హత్యలో ఆర్థిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయని ఆ అంశాలను పరిగణనలోకి తీసులేదని తులసమ్మ ఆరోపించారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, బీటెక్‌ రవి, రాజశేఖర్‌ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ను సీబీఐ విచారించేలా ఆదేశించాలని తులసమ్మ కోరారు. తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత వాంగ్మూలం నమోదు చేశారు.


Next Story