తిరుమలలో హిందూయేతర మత ప్రచారంపై విచారణ
తిరుమలలో హిందూయేతర మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం విచారణ చేపట్టింది.
By అంజి Published on 18 Nov 2024 2:30 AM GMTతిరుమలలో హిందూయేతర మత ప్రచారంపై విచారణ
తిరుమలలో హిందూయేతర మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం విచారణ చేపట్టింది. పాపవినాశనం ప్రాంతంలో కొందరు హిందూయేతర మత విశ్వాసాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని నివేదికలు పేర్కొన్నాయి. వారు తమ విశ్వాసానికి సంబంధించిన పాటలను కలిగి ఉన్న రీల్‌లను రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో చేశారు. ఈ వీడియోలను తిరుమల పవిత్ర క్షేత్రంలో చిత్రీకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజిలెన్స్ బృందం, స్థానిక పోలీసులు ఈ వీడియోల ప్రామాణికతను ధృవీకరించడానికి, హిందూయేతర మత కార్యకలాపాలను నిషేధించే తిరుమల నిబంధనలను ఉల్లంఘించారా అని నిర్ధారించడానికి పరిశీలిస్తున్నారు. పాపవినాశనం ప్రాంతంలో ఇతర మతాలకు చెందిన కొందరు వ్యక్తులు వీడియోలు తీశారని సోర్సెస్ చెబుతున్నాయి. వారు అభ్యంతరకరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి స్థానిక అటవీ అధికారుల నుండి కొంత సహాయం పొంది ఉండవచ్చు. హిందూయేతర మత గీతాలతో కూడిన రీల్స్‌ను రూపొందించినట్లు అనుమానిస్తున్న వీర రాఘవన్ శంకరమ్మ, మీనాక్షిలను టీటీడీ విజిలెన్స్ విభాగం అరెస్టు చేసింది. వీరిని విచారణ నిమిత్తం తిరుపతికి తరలించారు. తిరుమల 2-టౌన్ పోలీస్ స్టేషన్‌లో టీటీడీ ఫిర్యాదు చేయడంతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అటు తిరుమలలో టీటీడీ పాలకమండలి నేడు సమావేశం కానుంది. అన్నమయ్య భవనంలో ఉదయం 10.15 గంటలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అధ్యక్షతన జరిగే సమావేశంలో 70 అంశాలపై చర్చించనున్నారు. సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యం, సనాతన ధర్మ పరిరక్షణ సహా మరికొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.