అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల అసోషియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల అసోషియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి వారికి మంత్రి సత్యకుమార్ యాదవ్   హామీ ఇచ్చారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్దరణకు అంగీకరించారు. వెంటనే మరో 250 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్న ప్రభుత్వం తెలిపింది. బకాయిలన్నీ  చెల్లింపుపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది.