ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. చంద్రబాబుతో భేటీ కానున్న ప్రశాంత్ కిశోర్..!

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,

By Medi Samrat  Published on  23 Dec 2023 4:00 PM IST
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. చంద్రబాబుతో భేటీ కానున్న ప్రశాంత్ కిశోర్..!

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్.. శ‌నివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో క‌లిసి ద‌ర్శ‌నమిచ్చారు. గ‌న్నవరం ఎయిర్ పోర్టులో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వారిద్దరూ హైదరాబాద్ నుంచి గ‌న్న‌వ‌రం వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా ఇద్దరూ ఒకే వాహనంలో వెళ్లిన‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ప్రశాంత్ కిశోర్ కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఏపీలో త్వ‌ర‌లో ఎన్నికలు జరుగ‌నున్న‌ నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల కోసం ఏపీలో టీడీపీ, జనసేన ఇప్ప‌టికే పొత్తు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ వీరికి తోడు అయితే.. రాజకీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రం అవుతుంది. అయితే ప్రశాంత్ కిశోర్ తో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ఒప్పందం కుదుర్చుకుంటుందా? లేదా అన్నది వేచిచూడాలి.



Next Story