ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాశాంతి పార్టీతో చేయి కలపాలని నాలుగేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ ను కోరుతున్నామని, కానీ పవన్ కళ్యాణ్ రావడంలేదని అన్నారు. తనకు మోదీయే ముద్దు అంటున్నారని.. కానీ పవన్ ఢిల్లీ వెళితే మోదీ, అమిత్ షా అపాయింట్ మెంటే ఇవ్వరని అన్నారు. తాను ఇప్పుడు ఢిల్లీ వెళ్లినా మోదీ, అమిత్ షా తనను వెంటనే కలుస్తారని.. కానీ వాళ్లు తనకు అవసరం లేదని అన్నారు. 2019లో తన నుండే తప్పు జరిగిందని అన్నారు. ఒకరితో పొత్తులు పెట్టుకుందామని చివరి వరకు ఆగాం. వారు మోసం చేశారని.. అమ్ముడుపోయారన్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు నిలకడలేదు. పవన్ నిలకడగా ఉంటూ, ప్రజాశాంతి పార్టీతో కలిస్తే జనసేనకు ఓటు బ్యాంకు పెరుగుతుంది. నిలకడ లేకనే, కాపులందరూ ఆయనకు దూరమయ్యారన్నారు పాల్. తోట చంద్రశేఖర్ వంటి రిటైర్డ్ ఐఏఎస్, 'జేడీ' లక్ష్మీనారాయణ వంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, రావెళ్ల కిశోర్ వంటి నేతలు కూడా జనసేనలో చేరి వెంటనే వదిలేశారని తెలిపారు. కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పవన్ ను వదిలేశారన్నారు. వీళ్లందరూ ఎందుకు వదిలేశారంటే కారణం ఒక్కటేనని.. మోదీకి పవన్ మద్దతు ఇవ్వడమేనన్నారు. అందుకే పవన్ ను నాతో కలవమంటున్నాను. నేను రియల్ పెద్ద కాపును, మున్నూరు కాపును బీసీని అంటూ పాల్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.