జేడీ 1000 కోట్లు అడిగారు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించారు.

By Medi Samrat  Published on  23 Dec 2023 11:25 AM GMT
జేడీ 1000 కోట్లు అడిగారు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. లక్ష్మీనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. విశాఖలో ఎంపీగా నిలబడనని, తనకు మద్దతిస్తానని గతంలో లక్ష్మీనారాయణ చెప్పారని పాల్. ప్రజాశాంతి పార్టీ గెలవకుండా, ఓట్లు చీల్చడానికి లక్ష్మీనారాయణతో పార్టీ పెట్టిస్తున్నారని విన్నానని చెప్పారు. తనను నిలబెట్టి, గెలిపిస్తానని ఆయన మాట ఇచ్చారని అన్నారు.. తనను వెయ్యి కోట్లు అడిగారని, అకౌంట్లో డబ్బు చూపించమన్నారని, లేకపోతే పార్టీ పెడతానని అన్నారని చెప్పారు. రెండు నెలల క్రితం అమీర్ పేటలోని తమ కార్యాలయంలో ఇది జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆయనకు వెయ్యి కోట్లు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్సే వెయ్యి కోట్లు ఇచ్చుంటుందని ఆరోపించారు.

జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు.’ జై భారత్ నేషనల్’ పేరుతో పార్టీని ప్రకటించిన జేడీ జాతీయ జెండా రంగులతో తన ఫొటో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం తమ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానన్నారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నామన్నారు. మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడం. వాళ్లు తిన్నారని వీళ్లు.. వీళ్లూ తిన్నారని వాళ్లు అంటున్నారు. వాళ్లూ.. వీళ్లూ తిన్నారని సభల్లో ప్రకటించిన వాళ్లు మద్దతిస్తున్నారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తాం. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశాను. అన్ని వర్గాలను కలిశానన్నారు.

Next Story