మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ప్రభాస్‌కు పిలుపు

శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

By Medi Samrat  Published on  17 Feb 2025 11:30 AM IST
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ప్రభాస్‌కు పిలుపు

శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. తాజాగా బొజ్జల సుధీర్ రెడ్డి హీరో ప్రభాస్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. తాము నిర్వహించే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. స్వామివారి దర్శనం సందర్భంగా, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, ధూర్జటి కళా ప్రాంగణంతో పాటు రాజగోపురం పక్కనే ఉన్న స్థలంలో వేదిక ఏర్పాట్లను మంత్రి అనిత పరిశీలించారు. మహాశివరాత్రి సంద‌ర్భంగా భక్తుల ఎక్కువగా తరలి రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

Next Story