బ్రేకింగ్ : కానిస్టేబుల్ ఫిజికల్ ఫిట్‌నెస్‌ పరీక్షలు వాయిదా

Postponement of Constable Physical Fitness Tests. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు

By Medi Samrat
Published on : 10 March 2023 3:43 PM IST

బ్రేకింగ్ : కానిస్టేబుల్ ఫిజికల్ ఫిట్‌నెస్‌ పరీక్షలు వాయిదా

Constable Physical Fitness Test


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆ‎ధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సైతం ఇప్పటికే పూర్తి అయింది. ఫిజికల్ ఈవెంట్స్ ను ఈ నెల 14 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా వీటిని వాయిదా వేశారు.

అసెంబ్లీ నిర్వహణ, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు వాయిదా వేసినట్లు బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆ‎ధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ప్రకటించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌(PMT), ఫిజికల్ ఎలిజిబిలిటీ(PET) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.


Next Story