సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించి ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ప్రతి సోమ, గురువారాల్లో మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలన్న గుంటూరు కోర్టు బెయిల్ షరతుల ప్రకారం ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేశారు.
కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని పోసాని నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్‌లకు, కోర్టులకు తిప్పారు. ఇక ఆయన దేశం విడిచి వెళ్లరాదని, నమోదైన కేసుల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని, మీడియాకు ప్రకటనలు ఇవ్వరాదని షరతులు విధించింది.